Search Suggest

Enduku Chentaki Song Lyrics Konchem Ishtam Konchem Kashtam Movie (2009)

ఎందుకు చెంతకి వస్తావో ..ఎందుకు చేయొదిలేస్తావో స్నేహమా చెలగాటమా.. ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో.. ప్రణయమా పరిహాసమా శపించే దైవమ
0 min read

ఎందుకు చెంతకి వస్తావో ..ఎందుకు చేయొదిలేస్తావో 

స్నేహమా చెలగాటమా.. 

ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో..

ప్రణయమా పరిహాసమా 

శపించే దైవమా..దహించే దీపమా 

ఇదే నీ రూపమా ప్రేమా

ఫలిస్తే పాపమా..కలిస్తే లోపమా..గెలిస్తే నష్టమా ప్రేమా


ఈ..కలత...చాల్లే మమత... 

మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా..

మరలి రాని గతముగానే మిగిలిపోతావా 

రెప్పలు దాటవు స్వప్నాలు..చెప్పక తప్పదు వీడ్కోలు 

ఊరుకో..ఓ హృదయమా.. 

నిజం నిష్ఠూరమా..తెలిస్తే కష్టమా..కన్నీటికి చెప్పవే ప్రేమా

ఫలిస్తే పాపమా...కలిస్తే కోపమా..గెలిస్తే నష్టమా ప్రేమా


వెంటరమ్మంటూ..తీసుకెళ్తావు..నమ్మి వస్తే నట్టడవిలో విడిచిపోతావు 

జంటకమ్మంటూ..ఆశపెడతావు 

కలిమి ఉంచే చెలిమి తుంచే కలహమవుతావు.. 

చేసిన బాసలు ఎన్నంటే...చెప్పిన ఊసులు ఏవంటే 

మౌనమా...మమకారమా

చూపుల్లో శూన్యమా...గుండెల్లో గాయమా..మరీ వేధించకే ప్రేమా... 

ఎందుకు చెంతకి వస్తావో ..ఎందుకు చేయొదిలేస్తావో 

స్నేహమా చెలగాటమా.. 

ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో..ప్రణయమా పరిహాసమా


Movie    :  Konchem Ishtam Konchem Kashtam 

Lyrics    :  Sirivennela

Music    :  Shankar Ehsaan Loy

Singer   :  Unni Krishnan

Post a Comment