Search Suggest

Athimettani Song Lyrics Balu ABCDEFG Movie (2004)

అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బీ నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ సుతి మెత్తని కనులతొ కుమ్మీ సుమగంధం విరజిమ్మీ నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ

అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బీ 

నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ 

సుతి మెత్తని కనులతొ కుమ్మీ సుమగంధం విరజిమ్మీ 

నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ 

రౌడి అబ్బి నిను చూడంగానే మనసుబ్బీ వచ్చానబ్బీ అబ్బీ 

రాగలమ్మీ నువు పిలవంగానే నిను నమ్మీ వలచానమ్మీ అమ్మీ 

నన్నయ్యకి అన్నయ్ నువ్వై గురజాడ గురువే నువ్వై 

నవ కవితలు రాసెయ్ ఓ రబ్బీ 

సుతి మెత్తని కనులతొ కుమ్మీ సుమగంధం విరజిమ్మీ

నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ


లేపాక్షి నంది నీ రూపులొ చేపాక్షినయ్యా నీ చెరువులో 

అద్దంకి చీర నీ మేనిలో అడ్డంకినయ్యా నీ త్రోవలో 

కోనలు తలకోనలు నీ మీసాలలో ఏరులు కొల్లేరులు నీ మురిపాలలో 

మేడలు బెజవాడలు నీ పరువాలలో దాడులు పలనాడులు నీ పంతాలలో 

అమరావతి శిల్పాన్ని నేనై చిగురించా నీ నీడలో నీడలో 

హైద్రాబాది బిర్యాని రుచినే చవి చూసా నీ తోడులో తోడులో 

గోదావరి గనిలో కన్నా ఖనిజాలు నాలో మిన్న సోదాలే చేసెయ్ ఓ రబ్బి 


ఆ కోన సీమ నీ కులుకులో కొటప్ప కొండ నీ గుండెలో 

ఆ కాక రేగె నా తనువులో ఓ కాకతీయ నీ చెలిమితో 

మేలిమి శివ తాండవం నీ పాదాలలో బాసర మంత్రాలయం నీ బంధాలలో 

నైరుతి రుతు మారతం ఇక నీ రాకతో నైజాముల పరిపాలనం మన నడిజాములో 

అరకు లోయ ఇరుకుల్లో నేనే పడుతున్నా ఈ వేళలో లో వేళలో లో 

విఠలాచార్యా వింతలనే నేనే చూస్తున్నా నీ లీలలో లీలలో 

ఆ రామగుండంలోని వెలుగంతా చూపిస్తాలే ఈ ప్రేమల్లోనె ఓ లమ్మి 

అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బీ

నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ

సుతి మెత్తని కనులతొ కుమ్మీ సుమగంధం విరజిమ్మీ

నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ 


Movie    :  Balu ABCDEFG

Lyrics    :  Chandrabose

Music    :  Manisharma

Singers  :  Ranjith, Mahalakshmi

2 comments

  1. అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బీ

    నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ
  2. very very good job--sir