కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే...
ఉహాలన్ని పాటలే కనుల తోటలో...
తొలి కలల కవితలే మాట మాటలో...
ఒహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే...
గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే...
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే...
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు...
పువ్వు సోకి నీ సోకు కందేనే...
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది...
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది...
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు...
అగ్ని కంటే స్వచ్ఛమైనది...
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
ఉమాదేవి గా శివుని అర్థ భాగమై నా లోన నిలువుమా...
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో...
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా...
Movie : Guna
Lyrics : Vennelakanti
Music : Ilayaraja
Singers : S P Sailaja, Kamal Hasan