Search Suggest

Naa Manusukemyindi Song Lyrics Nuvve Nuvve Movie (2002)

నా మనసుకేమయింది నీ మాయలో పడింది.. నిజమా కలా తెలిసేదెలా.. నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది.. దాచేదెలా లోలోపలా.. మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే

నా మనసుకేమయింది నీ మాయలో పడింది..

నిజమా కలా తెలిసేదెలా..

నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది..

దాచేదెలా లోలోపలా..

మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది..

అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది..

నా మనసుకేమయింది నీ మాయలో పడింది..

నిజమా కలా తెలిసేదెలా..


చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ..

కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా..

జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ..

అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ..

పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి..

పెంచుకున్న మత్తులో పడి మతే చెడి..

గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని..

నా మనసుకేమయింది నీ మాయలో పడింది..

నిజమా కలా తెలిసేదెలా..


ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ..

ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ..

ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ..

ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ..

లోకమంటే ఇద్దరే అదే మనం అని..

స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని ..

వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని...

నా మనసుకేమయింది నీ మాయలో పడింది..

నిజమా కలా తెలిసేదెలా..

మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది..

అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది..


Movie    :  Nuvve Nuvve

Lyrics    :  Sirivennela

Music    :  Koti

Singers  :  Udit Narayana, Nithya Santoshini

Post a Comment