Search Suggest

Jabilamma Neeku Antha Kopama Song Lyrics Pelli Movie (1997)

జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె

జాబిలమ్మ నీకు అంత కోపమా

జాజిపూల మీద జాలి చూపుమా 

జాబిలమ్మ నీకు అంత కోపమా

జాజిపూల మీద జాలి చూపుమా

నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 

అల్లాడిపోదా రేయి ఆపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా


చిగురు పెదవి పైన చిరు నవ్వై చేరాలనుకున్నా

చెలియ మనసులోన సిరి మువ్వై ఆడాలనుకున్నా

ఉన్న మాట చెప్పలేని గుండెలొ విన్నపాలు వినపడలేదా

హారతిచ్చి స్వాగతించు కల్లలో ప్రేమ కాంతి కనపడలేదా

మరి అంత దూరమా కలలు కన్నా తీరమా

జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా


మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బోమ్మా

మనవి ఆలకించి మనసిస్తే చాలే చిలకమ్మా

ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా

తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహం అంటె ద్వేషమా

ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్నా నేస్తమా

జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా 

జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా

నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయి ఆపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా 


Jabilamma Niku Antha Kopama Song Lyrics Details

Movie:  Pelli

Lyrics:  Sirivennela

Music:  S A Rajkumar

Singer:  S P Balu.

Post a Comment