Search Suggest

Ghal Ghal Ghal Ghal Song Lyrics Nuvvostanante Nenoddantana (2005)

ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే Ghal Ghal Ghal Ghal Song Lyrics

ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే

ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే

అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం

ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం

దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీ

స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే

మేఘం లో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించి

మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే


ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా

ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదఇస్తుందో గమనించే సమయం ఉంటుందా

ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే

అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం

సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే

దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే

సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే


మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే

పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే

తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే

తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగక

దొరికే వరమే వలపంటే

జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా

రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా


Movie    :  Nuvvostanante Nenoddantana

Lyrics   :  Sirivennela

Music   :  Devi Sri Prasad

Singer  :  S P Balu

7 comments

  1. The best number
    one love song
  2. This song melts my heart
  3. Melts
  4. My fav ever.. beautiful song. Its remember my olden love days
  5. Sirivennela gari geyam amogam
  6. Balu gari swaram charithardham
  7. Beautiful lyrics and singing also