Search Suggest

Evvare Nuvvu Song Lyrics Raju Bhai(2007)

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు నాకూ ఓ మనసుందం

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు

కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు

తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు

నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు

మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు


ఎటు చూసినా ఏంచేసినా ఏదారిలో అడుగేసినా

నలువైపులా నా ఎదురే ఉందామైనా ఆమైనా

ఏ మబ్బులో దోగాడినా ఏ హాయిలో తేలాడినా

నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా

ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలొ పడితే ఇంతేనా

ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా

నా తీరుతెన్ను మారుతోందిగా


చెలి చూపులో చిరుగాయమై మలిచూపులో మటుమాయమై

తొలిప్రేమగా నే మొదలౌతున్నా కలలే కన్నా

నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై

ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా

ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను

తీయని దిగులై పడి ఉన్నాను చెలిలేనిదే బ్రతికేదెలా

ఏ ఊపిరైన ఉత్తిగాలిలే


Movie   :  Raju Bhai

Lyrics   :  Ramajogayya Sastry

Music   :  Yuvan Shankar Raja

Singer  :  Harish Raghavendra

Post a Comment