Search Suggest

Cheliya Cheliya Song Lyrics Idiot Movie (2002)

చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనులానీరే నదులై ప్రియురాలా కనవా నా ఆవేదనా ప్రియురాలా

చెలియా చెలియా తెలుసా

కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే

సఖియా మనసే అలుసా

కలిసే దారే కరువై కనులానీరే నదులై

ప్రియురాలా కనవా నా ఆవేదనా

ప్రియురాలా వినవా ఈ ఆలాపన

వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా

చెలియా చెలియా తెలుసా

కలలే కలలై

సఖియా మనసే అలుసా

కలిసే దారే కరువై

మదిలో దిగులే రగిలే కనులానీరే నదులై


ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు

ఆశై ఎగిసే అలనే మాయం చేసిందెవరు

వినపడుతున్నది నామదికి

చెలి జిలిబిలి పలుకుల గుసగుసలు

కనబడుతున్నవి కన్నులకీ

నినమొన్నల మెరిసిన ప్రియలయలు

ఇరువురి ఎదసడి ముగిసినదా

కలవరముల చెర బిగిసినదా

చెలియా చెలియా దరిరావా

సఖియా సఖియా జత కావా

ఓ....ఓ.... రెప్పల మాటున

ఉప్పెన రేపిన మేఘం ఈ ప్రేమ 

చెలియా చెలియా తెలుసా

కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే

సఖియా మనసే అలుసా

కలిసే దారే కరువై కనులానీరే నదులై


గతమే చెరిపేదెవరు దిగులే ఆపేదెవరు

కబురే తెలిపేదెవరు వలపే నిలిపేదవరు

జననం ఒకటే తెలుసుమరి

తన మరణం అన్నది ఎరుగదది

కాదని కత్తులు దూస్తున్నా

మమకారం మాత్రం మరువదది

చరితలు తెలిపిన సత్యమిదే

అంతిమ విజయం ప్రేమలదే

చెలియా చెలిమే విడువకుమా

గెలిచేదొకటే ప్రేమ సుమా

ఓ...ఓ... గుండెల గుడిలో

ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ 

చెలియా చెలియా తెలుసా

కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే

ప్రియురాలా కనవా నా ఆవేదనా

ప్రియురాలా వినవా ఈ ఆలాపన

వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా

చెలియా చెలియా తెలుసా

కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే


Movie    :  Idiot

Lyrics    :  Peddada Murthy

Music    :  Chakri

Singer   :  Ravi Varma

Post a Comment