Search Suggest

Aakupachanni Chandamamala Song Lyrics Jyo Achyutananda Movie (2016)

ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం ఈ రోజే గమ్మత్తుగా గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం దాచేయ్యాలన్నంతగా కేరింతల్లో ఇలా... సీతాకోకలా.. ఎ

 ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం 

ఈ రోజే గమ్మత్తుగా 

గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం 

దాచేయ్యాలన్నంతగా 

కేరింతల్లో ఇలా... సీతాకోకలా.. ఎగిరిందిలే మనస్సంతా 

సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా 

మనచుట్టే వుంటుందిగా చూస్తే ఇలా 

ఆహాహా బాగున్నదీ 

ఈ హాయి బాగున్నదీ 

ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం 

ఈ రోజే గమ్మత్తుగా 

గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం 

దాచేయ్యాలన్నంతగా 


తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం

తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం 

వసారాలు దాటొచ్చాయీ వసంతాలు ఈ వేళా 

తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా 

ప్రతీ దారి ఓ మిణుగుర్లా మెరుస్తోంది ఈ వేళా 

కలుస్తున్నవే నింగినేలా 

ఆహాహా బాగున్నదీ

ఆహాహా బాగున్నదీ 

ఈ హాయి బాగున్నదీ

ఈ హాయి బాగున్నదీ

ఆహాహా బాగున్నదీ 

బాగున్నదీ బాగున్నదీ 


భుజంతో భుజాన్నే తట్టి బలంగా భరోసా ఇచ్చుకుందాం 

ఒకర్లో ఒకర్లా మారి నిదర్లో కలల్నే పంచుకుందాం 

మహా మత్తులో ఈరోజే పడేస్తోంది ఈ గాలీ 

సుగంధాలు ఏం జల్లిందో అడగాలీ 

మరో పుట్టుకా అన్నట్టూ మరీ కొత్తగా వుందీ 

ఇందేం చిత్రమో ఏమో గానీ ఆహాహా బాగున్నదీ

ఆహాహా బాగున్నదీ 

ఈ హాయి బాగున్నదీ

ఈ హాయి బాగున్నదీ

ఆహాహా బాగున్నదీ


Movie    :  Jyo Achyutananda

Lyrics    :  Bhaskara Bhatla

Music    :  Kalyan Koduri

Singers  :  Karthik, Ramya Behra

Post a Comment