Search Suggest

Baby he loves you loves u song lyrics in telugu from arya 2 movie

Baby he loves you loves u song lyrics in telugu from arya 2 movie

ఛ! వాడికి నా మీద ప్రేమే లేదు ..

He doesn’t love me you know !

No.. He loves you.. He loves you so much !

అవునా? ఎంత?

ఎంతంటే?

ఆఁ .. మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడూ.. కలిగినట్టి కోపమంత

మొదటిసారి నేను మాట్లాడినప్పుడూ .. పెరిగినట్టి ద్వేషమంత

మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడూ .. జరిగినట్టి దోషమంత

చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడూ .. తీరినట్టి భారమంత

ఓ .. ఇంకా ?

ఓ .. తెలతెల్లవారి పల్లెటూరిలోనా .. అల్లుకున్న వెలుగంతా

పిల్ల లేగదూడ నోటికంటుకున్న .. ఆవుపాల నురగంతా

ఓ .. చల్లబువ్వలోన నంజుకుంటు తిన్న .. ఆవకాయ కారమంతా

పెళ్ళి ఇడు కొచ్చి తుళ్ళి ఆడుతున్న .. ఆడపిల్ల కోరికంత

Baby .. He loves you ..loves u .. loves u so much !

Baby .. He loves you ..loves u .. loves u so much !!

హే .. అందమైన నీ కాలికింద తిరిగే .. నేలకున్న బరువంతా

నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే .. నింగికున్న వయసంతా

చల్లనైన నీ శ్వాసలోన తొణికే .. గాలికున్న గతమంతా

చుర్రుమన్న నీ చూపులోన ఎగసే .. నిప్పులాంటి నిజమంత !

Baby .. He loves you ..loves u .. loves u so much !

Baby .. He loves you ..loves u .. loves u so much !!

హాయ్ .. పంటచేలలోని జీవమంతా .. ఘంటసాల పాట భావమంతా

పండగొచ్చినా.. పబ్బమొచ్చినా .. వంటశాల లోని వాసనంతా

కుంభకర్ణుడీ నిద్దరంతా .. ఆంజనేయునీ ఆయువంతా

కృష్ణమూర్తిలో లీలలంతా .. రామలాలి అంత !

Baby .. He loves you ..loves u .. loves u so much !

Baby .. He loves you ..loves u .. loves u so much !!

పచ్చి వేప పుల్ల చేదు అంతా .. చేదు

రచ్చబండపైన వాదనంతా

అర్ధమైనా కాకపోయినా .. భక్తి కొద్ది విన్న వేదమంతా

ఏటి నీటిలోన జాబిలంతా .. జాబిలీ

ఏట ఏట వచ్చె జాతరంతా .. జాతరా

ఏకపాత్రలో నాటకాలలో .. నాటుగోలలంత !

Baby .. He loves you ..loves u .. loves u so much !

Baby .. He loves you ..loves u .. loves u so much !!

అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత

జల్లు పడ్డవేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంతా

హో .. బిక్కుబిక్కుమంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత

ఆ .. లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత

Baby .. He loves you ..loves u .. loves u so much !

Baby Baby .. He loves you ..loves u .. loves u too much !!

ఎంత దగ్గరైన నీకు నాకు మధ్యనున్న అంతులేని దూరమంత

ఎంత చేరువైన నువ్వు నేను కలిసీ చేరలేని తీరమంత

ఎంత ఓర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత

ఎంత గాయమైన హాయిగానె మార్చే ఆ తీపి స్నేహమంత !

Baby .. He loves you ..loves u .. loves u so much !

Baby .. He loves you ..loves u .. I love u so much !!

Post a Comment