Skip to main content

Gijjagiri Lyrics In Telugu - folk song

Gijjagiri Lyrics In Telugu - folk song


Female: గిజ్జగిరి తొవ్వలోనా…

గిజ్జగిరి తొవ్వలోన

ఒలగుమ్మ నాయిగుమ్మ

గజ్జెలాది కోడిపుంజు

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: గజ్జెలాది కోడిపుంజు

ఒలగుమ్మ నాయిగుమ్మ


Female: రాజపాడిపట్టవోతే

ఒలగుమ్మ నాయిగుమ్మ

రాతిగోడదుంకి పాయె

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: రాజనాలు బుక్కి వచ్చే

ఒలగుమ్మ నాయిగుమ్మ

కొక్కొరోక్కో కొక్కో కో క్కో కొక్కోరొక్కో



Female: రాజనాలు బుక్కి వత్తే

ఒలగుమ్మ నాయిగుమ్మ

కాపుకొడుకు కళ్లజూసే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: తరిమి తరిమి పట్టుకునే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Female: తరిమి తరిమి పట్టుకొని

ఒలగుమ్మ నాయిగుమ్మ

గుడిసెలకు తీస్కాపాయే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: గుడిసెలకు తీస్కాపాయే

ఒలగుమ్మ నాయిగుమ్మ


Female: ఓరి వారి వారి వారి ఓరి వారి

గుడిసెలకు తీస్కాపోతే

ఒలగుమ్మ నాయిగుమ్మ

గుడాలు వెడ్తాడానుకుంటి

ఓలగుమ్మా నాయిగూమ్మ

Female: గుడాలు వెడ్తాడానుకుంటి

ఒలగుమ్మ నాయిగుమ్మ

గుడాలు కాదు గిడాలు కాదు

ఒలగుమ్మ నాయిగుమ్మ

సప్ప సప్ప సంపవట్టే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: సప్ప సప్ప సంపవట్టే

ఒలగుమ్మ నాయిగుమ్మ


Female: ఓలమ్మ కోడిపుంజు

పందాల కోడిపుంజు

పంచాతి వెట్టినాదే

ఎట్ల ఎల్లిపాయే రోజు

వవ్వారే కోడిపుంజు

వయ్యారి కోడిపుంజు

కీసులాట పాడుగాను

గింజలేసి దీన్ని గుంజు

ఖిల్లాడి కోడిపుంజు

వవ్వారే కోడిపుంజు

కొట్లాటవెట్టినాది

కోసుకుని దీన్ని నంజు

గిజ్జగిరి తొవ్వలోన

గిజ్జగిరి గిజ్జగిరి


Female: గిజ్జగిరి తొవ్వలోన

ఒలగుమ్మ నాయిగుమ్మ

గజ్జెలాది కోడిపుంజు

ఒలగుమ్మ నాయిగుమ్మ

గజ్జెలాది కోడిపుంజు

ఒలగుమ్మ నాయిగుమ్మ

(కొక్కోరోక్కో కొక్కో కో క్కో కొక్కోరోక్కో)


Female: పచ్చిపాల కంకిమీద

ఒలగుమ్మ నాయిగుమ్మ

పాలపిట్టలొచ్చి ఆలే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: పాలపిట్టలొచ్చి ఆలే

ఒలగుమ్మ నాయిగుమ్మ

కంచె ఎక్కి కాపుకొడుకు

ఒలగుమ్మ నాయిగుమ్మ

కూ అని కీకలేసే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: కూ అని కీకలేసే

ఒలగుమ్మ నాయిగుమ్మ

(ఒలగుమ్మ ఒలగుమ్మ ఒలగుమ్మ నాయిగుమ్మ)


Female: కూ అని కీకలేసి

ఒలగుమ్మ నాయిగుమ్మ

వడిసేలా సేతవట్టే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: వడిగే వడిగే వన్నె రువ్వే

ఒలగుమ్మ నాయిగుమ్మ


Female: ఒరయ్యో పాలపిట్టా

వీడేమో నన్నుగొట్టా

ఆ కన్నె సూపులల్ల

ఒళ్ళు మండే సిట్టసిట్ట

నేనేమో ఉరకవట్ట

నాసెయ్యి దొరకవట్ట

ఈ గిల్లీ గిచ్చులల్ల

ఎర్రగయ్యే బుగ్గసొట్ట

ఒడిసేల రాళ్లువెట్ట

సాటుంగ కన్నుగొట్టా

నా కొంగు ఇడ్సవెడితే

దాటిపోత సెరువు కట్ట


Female: గిజ్జగిరి తొవ్వలోనా

గిజ్జ గిజ్జ గిజ్జ గిజ్జ

గిజ్జగిరి తొవ్వలోన

ఒలగుమ్మ నాయిగుమ్మ

గజ్జెలాది కోడిపుంజు

ఒలగుమ్మ నాయిగుమ్మ

గజ్జెలాది కోడిపుంజు

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: ఓరి వారీ వారి వారి ఓరి వారి


Female: కొయ్యి వడిగే నన్ను రువ్వి

ఒలగుమ్మ నాయిగుమ్మ

తాడు సేతవట్టినాడే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: తాడు సేతవట్టినాడే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Female: తాడు సేత వట్టుకుంటే

ఒలగుమ్మ నాయిగుమ్మ

ఉయ్యాలా గడుతడనుకుంటి

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: ఉయ్యాలా గడుతడనుకుంటి

ఒలగుమ్మ నాయిగుమ్మ

(కొక్కోరోక్కో కొక్కో కో క్కో కొక్కోరోక్కో)


Female: ఉయ్యాలా గడుతడనుకుంటే

ఒలగుమ్మ నాయిగుమ్మ

మంచెకొమ్మకిరిసికట్టే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: మంచెకొమ్మకిరిసికట్టే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Female: పుట్టమీది గొడ్డు కర్ర

ఒలగుమ్మ నాయిగుమ్మ

పీకి సేత వట్టినాడే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: పీకి సేత వట్టినాడే

ఒలగుమ్మ నాయిగుమ్మ

(ఒలగుమ్మ ఒలగుమ్మ ఒలగుమ్మ నాయిగుమ్మ)


Female: వాని కట్టమేమి తింటి

ఒలగుమ్మ నాయిగుమ్మ

తింపి తింపి కొట్టవట్టే

ఒలగుమ్మ నాయిగుమ్మ

Chorus: తింపి తింపి కొట్టవట్టే

ఒలగుమ్మ నాయిగుమ్మ


Female: వీడేమి పెట్టె మందు

నేనెట్ల సెప్పుకుందు

ఇడుస్తలేడు దొరికెనంటే

సాలు సిన్న సందు

వాడుంటే కంట్ల ముందు

నానోటి మాట బందు

ఈ మోటు శాతలేను

ఎట్లా నేను తట్టుకుందు

వాకిట్ల నేనుందు

బజాట్ల మొత్తుకుందు

ఇచ్చేస్తా బండిమీతు

ఈడి సెయ్యి పట్టుకుందు


Female: గిజ్జగిరి తొవ్వలోనా

గిజ్జ గిజ్జ గిజ్జ గిజ్జ

గిజ్జగిరి తొవ్వలోన

జగీరి జగీరి


Female: గిజ్జగిరి తొవ్వలోన

ఒలగుమ్మ నాయిగుమ్మ

గజ్జెలాది కోడిపుంజు

ఒలగుమ్మ నాయిగుమ్మ

గజ్జెలాది కోడిపుంజు

ఒలగుమ్మ నాయిగుమ్మ

(ఓరి వారీ వారి వారి ఓరి వారి)



Song Category- Telangana Folk Song

Lyrics (Adnl)- Kasarla Shyam

Singers- Mangli, Kanakavva

Music- Madeen SK

Song Lable- Speaker

Comments

Popular posts from this blog

Ekadantaya Vakratundaya Song Lyrics in Telugu

గణనాయకాయ గణదైవతాయ గనదక్షాయ ధీమహీ గుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాయ ధీమహీ గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనె గానౌచుకాయ గానమత్తాయ గానౌ చుక మనసే గురు పూజితాయ, గురు దైవతాయ గురు కులత్వాయినే గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య కలక్షేత్రె గురు ధర్మ సదా రాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాకండ కండ కాయ గీత సారాయ గీత తత్వాయ గీత కోత్రాయ ధీమహి గూడ గుల్ఫాయ గంట మత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గంధర్వ రాజాయ గంధాయ గంధర్వ గాన శౌర్య ప్రణైమె గాఢ అనురాగాయ గ్రంధాయ గీతాయ గ్రందార్థ తన్మైయె గురిలే ఏ గుణవతే ఏ గణపతయే ఏ గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనె గీత లీనాయ గీతా

Monna Kanipinchavu Song Lyrics Surya S/O Krishnan(2008)

మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా ఊరంతా చూసేలా అవుదాం జత ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా ఊరంతా చూసేలా అవుదాం జత మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే ముఖం చూసి పలికే వేళ భలే ప్రేమ చూసిన నేను హత్తుకోకపోతానా అందగాడా ఓ..నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలి పోగవోలె పరుగున వస్తా తాకనే చెలి వేడుకవో కలవో నువ్వు వింతవో చెలి మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. కడలి నేల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం మనసు జిల్లుమంటుందే ఈ వేళలో తల వాల్చి ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేసావే పెదవికి పెదవి దూరమెందుకే పగటి కలలు కన్నా నిన్ను కునుకు లేకనే హృదయమంత నిన్నే కన్నా దరికి రాకనే నువ్వు లేక నాకు లేదు లోకమన్నది మొన

Vennelave Vennelave Song Lyrics Merupu Kalalu Movie (1997)

వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా… ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం  ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం  చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం  పిల్లా ఆ .. పిల్లా ఆ .  భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..  పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా  ఈ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా.  వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా  కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా  ఎద గిల్లీ గిల్లీ వసంతాన్నే ఆడించే  హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ  పిల్లా ఆ.. పిల్లా ఆ..  పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా  పూతీగ కల