Search Suggest

Colour Photo Song Lyrics in Telugu - Tharagathi Gadhi Song

తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకుల లాగే జారే.. గుసగుసలను వింటూ అలలుగ వయసు పదపదమని తీరం చేరే ..

Colour Photo Song Lyrics


 పల్లవి : 

తొలి పలుకులతోనే కరిగిన మనసు

చిరు చినుకుల లాగే జారే..

గుసగుసలను వింటూ అలలుగ వయసు

పదపదమని తీరం చేరే ..


ఏ పనీ పాట లేనీ ఈ చల్ల గాలి 

ఓ సగం చోటే కోరి

మీ కథే విందా..


ఊరూ పేరూ లేని ఊహా లోకానా

తారాతీరం దాటి సాగిందా ప్రేమా..


తరగతి గది దాటి తరలిన కథకీ

తెలియని తెగువేదో చేరే..

అడుగులు పడలేనీ తొలి తపనలకి

ఇరువురి మొహమాటాలే దూరము పోయే…నేడే..!! 


చరణం : 


రాణే గీత దాటే విధే మారే           

తానే తోటమాలి దరే చేరే  ..


వెలుగూ నీడల్లే కలిసే సాయంత్రం 

రంగే లేకుండా సాగే చదరంగం  ..


సంద్రం లో నదిలా జంటవ్వాలంటూ 

రాసారో లేదో ఆ దేవుడుగారు తరగతి గది దాటి తరలిన కథకీ

తెలియని తెగువేదో చేరే..

అడుగులు పడలేనీ తొలి తపనలకి

ఇరువురి మొహమాటాలే దూరము పోయే…నేడే..!!


Colour Photo Song Lyrics in Telugu - Tharagathi Gadhi Song Details

Movie Name: Colour Photo

Singer: Kaala Bhairava

Music: Kaala Bhairava

Lyrics: Kittu Vissapragada

Star Cast: Suhas, Chandini Chowdary

Post a Comment