Search Suggest

O Priyurala Song Lyrics Mounamelanoye Movie (2002)

ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా నీ నయనాల ఆ గగనాల సితారకలా మల్లె మాలికలే రచించే మౌన గీతికలా సన్న జాజులలో సుమించే సందె కోరికలా

ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా

నీ నయనాల ఆ గగనాల సితారకలా

మల్లె మాలికలే రచించే మౌన గీతికలా

సన్న జాజులలో సుమించే సందె కోరికలా

ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడా

నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ

తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా

పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా..

ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా

నీ నయనాల ఆ గగనాల సితారకలా


నీ పెదవి దాటే పూల ఋతువేదో

మీటింది నాలో సుఖ వీణలే

నీ కనుల దాటే తీపి కల ఏదో

రాసింది నాకే శుభలేఖలే

ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా

ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడా


నా కథలు రాసే నీ కవితలెన్నో

కరిగించే నాలో కనుపాపలే

నీ నడుము దాచే ఊయలలు ఎన్నో

పలికించే నాలో ప్రియ జోలలే

ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడా

నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ

తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా

పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా

ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా

నీ నయనాల ఆ గగనాల సితారకలా


Movie    :  Mounamelanoye

Lyrics    :  Veturi

Music    :  Ramana Gogula

Singers  :  Ramana Gogula, Priya

Cast      :  Sachin, Sampada

Post a Comment