Search Suggest

Janavule Nerajanavule Song Lyrics Aditya 369 Movie (2000)

నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తిమ్మెరలే మోవిగని మొగ్గగని మోజ

నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

కన్నులలో సరసపు వెన్నెలలే

సన్నలలో గుసగుస తిమ్మెరలే

మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో


మోమటు దోచి మురిపెము పెంచే లాహిరిలో అహహా హహా

మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో

చెలి ఒంపులలో హంపికలా ఊగే ఉయ్యాల

చెలి పయ్యదలో తుంగ అలా పొంగే ఈ వేళ

మరి అందుకు విరి పానుపు సవరించవేమిరా...

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

కన్నులలో సరసపు వెన్నెలలే

సన్నలలో గుసగుస తిమ్మెరలే

మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో


చీకటి కోపం చెలిమికి లాభం... కౌగిలలో

వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో

చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ

తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ

పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా...

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

కన్నులలో సరసపు వెన్నెలలే

సన్నలలో గుసగుస తిమ్మెరలే

మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో


Movie    :  Aditya 369

Lyrics    :  Veturi

Music    :  Ilayaraja

Singers :  S P Balu, SP Sailaja, S Janaki

Cast      :  Bala Krishna, Mohini Chowdhury

4 comments

  1. Superrrrrrr
  2. Tq
  3. Only Veturi sir can do this....
  4. Its sung jikki not by janaki