Search Suggest

Eduta Nilichindi Choodu Song Lyrics Vaana Movie (2008)

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతు

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో

మైమరచిపోయా మాయలో

ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ

ఎదుట నిలిచింది చూడు


నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలీ

కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ

అవునో కాదో అడగకంది నా మౌనం

చెలివో శిలవో తెలియకుంది నీ రూపం

చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఆ ఆ

ఎదుట నిలిచింది చూడు


నిన్నే చేరుకోలేక ఎటేళ్ళిందో నా లేఖా

వినేవారు లేకా విసుక్కుంది నా కేకా

నీదో కాదో రాసున్న చిరునామా

ఉందో లేదో ఆ చోట నా ప్రేమా 

వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఆ ఆ

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో

మైమరచిపోయా మాయలో

ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ

ఎదుట నిలిచింది చూడు


Movie    :  Vaana 

Lyrics    :  Sirivennela 

Music    :  Kamalakar 

Singer   :  Karthik

Post a Comment