Search Suggest

Naa Pata Teta Telugu Song Lyrics Athade Oka Sainyam Movie (2004)

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట.. నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట.. పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట.. నీలిమబ్బులకు

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట..

నీలిమబ్బులకు స్నానం పోసే చిటపట పాట..

రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట..

కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట..

దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట..

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట..

పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట..

చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట..

పడుచు గుండె ప్రాంగణాలలో మోగుతున్న పాట..

అందరు మెచ్చే పాట.. ఒకరికి అంకితమిచ్చే పాట..

అందరు మెచ్చే పాట.. ఒకరికి అంకితమిచ్చే పాట..

పదాలు అన్నీ బోయీలై ప్రేమ పల్లకిని మోసే..

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట..

కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట..

నదులలోని జీవరాగమే నింపుకున్న పాట..

వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట..

ప్రకృతి నేర్పిన పాట.. చక్కని ఆకృతి దాల్చిన పాట..

ప్రకృతి నేర్పిన పాట.. చక్కని ఆకృతి దాల్చిన పాట..

మనస్సు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసే..

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట..

నీలిమబ్బులకు స్నానం పోసే చిటపట పాట..

రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట..

కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట..

దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట..

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

Movie    :  Athade Oka Sainyam

Lyrics    :  Chandrabose

Music    :  S V Krishna Reddy

Singer   :  Sunitha

6 comments

  1. Nice song 👌👌
  2. svs1673@gmail.com
  3. svs1673@gmail.com
  4. Very nicely
  5. Mice
  6. Nice.SONG