గాలిలో ఊగిసలాడే దీపంలా.
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం..
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం..
సుడిగాలిలో పడిపడి లేచే..
పడవల్లే తడబడుతున్నా..
నీకోసం.. వేచుందే.. నా ప్రాణం..
ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే..
నా బుజ్జితల్లీ...
నీరు లేని చేపల్లే..
తార లేని నింగల్లే..
జీవమేది నాలోనా..
నువ్వు మాటలాడందే..
మళ్లీ యాలకొస్తానే..
కాళ్లయేళ్ల పడతానే..
లెంపలేసుకుంటానే..
ఇంక నిన్ను యిడిపోనే..
ఉప్పు నీటి ముప్పుని కూడా..
గొప్పగ దాటే గట్టోన్నే..
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే..
నీకోసం.. వేచుందే.. నా ప్రాణం..
ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే..
నా బుజ్జితల్లీ...
ఇన్నినాళ్ల మన దూరం..
తియ్యనైన ఓ విరహం..
చేదులాగా మారిందే..
అందిరాక నీ గారం..
దేన్ని కానుకియ్యాలే..
ఎంత బుజ్జగించాలే..
బెట్టు నువ్వు దించేలా..
లంచమేటి కావాలే..
గాలివాన జాడే లేదే..
రవ్వంతైనా నా చుట్టూ..
అయినా మునిగిపోతున్నానే..
దారే చూపెట్టు..
నీకోసం.. వేచుందే.. నా ప్రాణం..
ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే..
నా బుజ్జితల్లీ...
చిత్రం : తండేల్ (Thandel)
పాట: బుజ్జి తల్లి (Bujji Thalli)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
తారాగణం: నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) & తదితరులు.
రచయిత, దర్శకుడు: చందూ మొండేటి (Mondeti)
సమర్పకులు: అల్లు అరవింద్ (Allu Aravind)
నిర్మాత: బన్నీ వాసు (Bunny Vasu)
కథ: కార్తీక్ తీడ (Kartheek Theeda)